డబ్బు, అవకాశవాద, ఫిరాయింపు రాజకీయాలను ఓడించండి

– సీపీఐ(ఎం)కు ఓటు వేయండి..ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి
– సీపీఐ(ఎం)అభ్య్యర్థి భూక్యా వీరభద్రంను గెలిపించండి
– అసెంబ్లీలో మాట్లాడుతాం…బయట పోరాడుతాం
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-వైరాటౌన్‌
డబ్బు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలను ఓడించాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని, సిపిఐ(ఎం)కు ఓటు వేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం వైరా పట్టణంలో సిపిఐ(ఎం) వైరా అసెంబ్లీ అభ్యర్థి ముఖ్య వీరభద్రం ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల గురించి మాట్లాడే వారు ఎవరూ, పరిష్కరించాలని ప్రభుత్వాలను నిలదీసే వారు ఎవరూ, అభివృద్ధి కోసం ప్రభుత్వాలను ప్రశ్నించే వారు ఎవరూ అని ఆలోచించి ఓటు వేయాలి కోరారు. గండగలపాడు గ్రామానికి చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు మధిర నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సిపిఐ(ఎం) శాసనసభ పక్ష నేతగా రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారాలు, ప్రజలందరి సమస్యల పైన గొంతెత్తి మాట్లాడి పరిష్కారం కోసం ప్రభుత్వాలను ఒప్పించే వాడిని, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించిన చరిత్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. వైరా నియోజకవర్గంలో మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో సిపిఐ(ఎం) అభ్యర్థి తప్పా, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ పార్టీలు ఫిరాయించారని, 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన చంద్రావతి, మదన్‌లాల్‌, రాముల నాయక్‌ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకే కారు ఎక్కి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గెలిచే వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ కారేక్కే ప్రమాదం ఉందని తెలిపారు.చైతన్యవంతమైన వైరా ప్రజలు, వ్యాపారస్తులు ఆలోచించాలని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పైన ఓట్లు వేయాలని, భూక్యా వీరభద్రం ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భూక్యా వీరభద్రం 42 సంవత్సరాల వయస్సులో 22 సంవత్సరాలు ప్రజా సమస్యల పైన పోరాడిన అనుభవం ఉందని, గిరిజనులు, రైతులు, కార్మికులు, కూలీలు, పేద ప్రజల సమస్యల మీద పోరాడుతున్న పోరాట యోధుడు భూక్యా వీరభద్రం అని కొనియాడారు. భూక్యా వీరభద్రంను గెలిపిస్తే పార్టీ ఫిరాయించడని, ఎమ్మెల్యే గిరిని అమ్ముకోడని, ప్రలోభాలకు లొంగడని, పైరవీలు చేయడని హామీ ఇచ్చారు. పోడు పోరాటంలో ఆరు నెలలు చర్లపల్లి జైలులో నిర్బంధించినా భయపడకుండా తిరిగి వచ్చి మళ్ళి ఎర్రజెండా పట్టుకున్నాడని, లాఠీ దెబ్బలకు భయపడడని, ప్రజలకోసం జైలుకు వెళ్ళడానికైనా, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు పారుపల్లి ఝాన్సీ, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్‌, చింతనిప్పు చలపతిరావు, బోడపట్ల రవీందర్‌, మల్లెంపాటి రామారావు, మచ్చా మణి, బొంతు సమత, గుడిమెట్ల రజిత, భూక్యా విజయ, హరి వెంకటేశ్వరరావు కొంగర సుధాకర్‌, పైడిపల్లి సాంబశివరావు, సంక్రాంతి నరసయ్య, గుడిమెట్ల మోహన్‌రావు, గుమ్మా నరసింహారావు, పారుపల్లి కృష్ణారావు గురుగుంట్ల శ్రీనివాసరావు, మల్లెంపాటి ప్రసాదరావు, షేక్‌ జమాల్‌ సాహెబ్‌, మాడపాటి మల్లికార్జునరావు, బాణాల శ్రీనివాసరావు, ఓర్సు సీతారాములు, ఎనమద్ది రామకష్ణ, వడ్లమూడి మధు, రుద్రాక్షుల నరసింహచారి, దేవబత్తి నరసింహారావు, నూకల వెంకటేశ్వరరావు, చిత్తారు మురళి, షేక్‌ నాగుల్‌ పాషా, పాపగంటి రాంబాబు, దేవుళ్ళ కష్ణ, చావా కళావతి, బందెల అమతమ్మ, దేవబత్తిని లక్ష్మీతులసి, దేవబత్తిని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love