11 నుండి పారిశుద్ధ్య డ్రైవర్ల సమ్మె ను జయప్రదం చేయండి

– తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పిలుపు
నవతెలంగాణ- కంఠేశ్వర్
11 నుండి పారిశుద్ధ్య డ్రైవర్ల సమ్మెను జయప్రదం చేయాలి అని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మర్యాద గోవర్ధన్ పిలుపునిచ్చారు.  ఈ మేరకు మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు), నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిసికి సమ్మె నోటీసును అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు మేడే కానుకగా పెంచిన వెయ్యి రూపాయల వేతనాన్ని రెండు నెలలు చెల్లించి, తిరిగి మళ్లీ ఆ వెయ్యి రూపాయలను రికవరీ చేయడానికి నిరసిస్తూ, పెంచిన వెయ్యి రూపాయలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11 నుండి సమ్మెలోకి పారిశుద్ధ్య డ్రైవర్లు వెళ్తున్నారని తెలిపారు, పెంచిన వేతనాలను పారిశుద్ధ డ్రైవర్లకు ఇవ్వాలని నగర మేయర్ కి, కమిషనర్ కి విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కానందున సమ్మెలోకి వెళ్తున్నామని అన్నారు, సమస్య పరిష్కారం చేసి సమ్మెను నివారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుధ్య డ్రైవర్ల యూనియన్ నాయకులు లక్ష్మణ్, వెంకటీష్, మహేష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love