– ఐదు లక్షల విలువ చేసే జాలీలు
– ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-చందుర్తి: అటవీ భూములను అక్రమించ కుండా అధికారులు ఆ శాఖ అధికారులు 1.5 కిలోమీటర్ల మేర జాలి కంచె వేశారు. దింతో అట్టి జాలి మాయం ఐన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.నర్సింగపూర్,తిమ్మాపూర్ సరిహద్దు అటవీ భూములను,కలపను రక్షించడానికి గత సంవత్సరం కిందట ఐదు లక్షల విలువ చేసే 1.5 కిలోమీటర్ల వరకు కంచె వేసారు.దింతో గుర్తు తెలియని వ్యక్తులు గత నెల కిందట అట్టి కంచెను ఎత్తు కెళ్లడం తో అటవీశాఖ అధికారులు చందుర్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లుగా తెలిసింది.దీంతో ఇట్టి విషయం ను ఆ శాఖ అధికారులు బయట కు పొక్కనియా కుండా ఉంచారు కానీ కొందరు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు జలీల దొంగతనం బయట పడింది.గత నెల 25న స్థానిక పోలీస్ స్టేషన్లో అటవీశాఖ అధికారులు పిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు పురోగతి లేకపోయింది.దీనిపై స్థానిక ఎస్సై అశోక్ ను వివరణ కోరగా వాస్తమే కానీ కేసు నమోదు చేసాం ఇంకా దర్యాప్తు నడుస్తుందని చెప్పడం కొస మెరుపు.