
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒకే పేరుతో రెండేసి ఓటర్లు గా నియోజక వర్గం మొత్తం 458 ఓటర్లు ను గుర్తించామని వాటిని తొలిగించి ఒకరికి ఒకే ఓటరు గుర్తిస్తూ ఓటరు జాబితాను సరి చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గం నాయకులు జారే ఆదినారాయణ మండల ఎన్నికల అధికారి తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కోరుతూ మంగళవారం వినతి పత్రం అందజేసారు. అశ్వారావుపేట మండలం 113, దమ్మపేట మండలం 142, ములకలపల్లి మండలం 74, అన్నపురెడ్డిపల్లి మండలం 43, చండ్రుగొండ మండలం 86,నియోజకవర్గ స్థాయిలో మొత్తం 458 ఓట్లు ఓటరు జాబితాలో డబుల్ పేర్లు ఉన్నాయని,పూర్తి స్థాయిలో పరిశీలించి తొలగించ గలరని జారే ఆయన్ను కోరారు.ఎన్నికల అధికారి దానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్, స్ధానిక సర్పంచ్ అట్టం రమ్య,నండ్రు రమేష్,ఆళ్ళ సత్తిబాబు,పల్లేల రామ లక్ష్మయ్య, సూరనేని ఫణి నాగు, తరుణ్ తేజ, నాగ కిషోర్ కార్యకర్తలు పాల్గొన్నారు.