అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ స్వరణకాంత శర్మ వాదనలు వాదనలు విన్నారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వోకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునే ఉద్దేశ్యంతో ఈ అరెస్ట్ జరిగిందని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ ఆధారాలు చూపలేకపోయిందని కోర్టుకు తెలిపారు. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కుంభకోణం జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌గా, వ్యక్తిగతంగా ఆయన పాత్ర ఉందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

Spread the love