మెప్పించేనట రత్నాలు

సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేష్‌ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తానా కథానాయిక. మర్డర్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎంఎల్‌ఎ ఎరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ, ”సినిమా ఇండిస్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారి ఇతివత్తంతో తీసిన సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుంది’ అని తెలిపారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ, ‘సినిమా బాగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాతలు: డా దివ్య, వై. చంటి, ఆనంద్‌ దాస్‌ శ్రీ మణికంఠ, కో ప్రొడ్యూసర్‌: కోయ సుబ్బారావు.

Spread the love