లంగర్ హౌస్‌లో ఫుట్ పాత్‌ ఆక్రమణల కూల్చివేత

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఫుట్ పాత్‌ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం కూల్చివేశారు. లంగర్ హౌస్ డివిజన్‌లోని రాందేవ్ గూడలో ప్రధాన రోడ్డును ఆక్రమించుకుని కొందరు దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో గురువారం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సర్కిల్ 13 సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.

Spread the love