ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన రాజల్ రావు,రాజేశ్వర్ రావు లు తమ ఇంటి స్థలాల విషయంలో గొడవలతో రోడ్డును ఆక్రమించి గోడలు నిర్మించారు. వీటిని తొలగించాలని పంచాయతీరాజ్ శాఖ చట్టం ప్రకారం కొన్ని రోజుల క్రితం ఇరువురికి నోటీసులు జారీ చేయగా ఇంటి యజమానులు ఇంటి గోడలు తొలగించకపోవడంతో శనివారం డిపిఓ అధికారి కృష్ణ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ డిఎస్పి సమక్షంలో ఇరువురి అక్రమ కట్టడాలు తొలగించడం జరిగింది. డి ఎల్ పి ఓ వెంకటయ్య, ఎంపీ ఓ నారాయణ, పంచాయతీ సెక్రెటరీ ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.