న్యూయార్క్ స్టేడియం కూల్చివేత..

నవతెలంగాణ – న్యూయార్క్ : వెస్టిండీస్ తో కలిసి ఈసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కు అమెరికా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యంలో ప్ర‌స్తుతం టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ టోర్నీ కోసం న్యూయార్క్‌లో న‌సావు కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌ను కేవలం 3 నెలల్లోనే నిర్మించారు. దీని నిర్మాణం కోసం ఏకంగా రూ. 243 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ స్టేడియంను కూల్చివేయ‌నున్నారు. న్యూయార్క్ లో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌లు ముగియ‌డంతో ఆ స్టేడియాన్ని కూల్చివేసేందుకు క‌స‌రత్తులు సిద్ధం అయ్యాయి. బుధ‌వారం అమెరికాతో భార‌త్ ఆడిన మ్యాచే ఆ వేదిక‌లో చివ‌రిది. గురువారం నుంచి ఈ పాక్షిక స్టేడియాన్ని క్ర‌మంగా తొల‌గించ‌నున్నారు. న‌సావు స్టేడియాన్ని తొల‌గించేందుకు ఇప్పటికే అక్క‌డ‌కు భారీ సంఖ్య‌లో బుల్డోజ‌ర్లు కూడా చేరుకున్నాయి.

Spread the love