నవతెలంగాణ – చివ్వేంల
మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ గోపి భవాని, డాక్టర్ అన్నం లిఖిత్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని నివారించుకుందాం” అనే నినాదంతో ఆశా వర్కర్లు మరియు ఆరోగ్య సిబ్బంది ప్రజలలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మన ఇళ్లలోని చిన్న కంటైనర్లలో పెరిగే హానికరమైన ఈడీస్ ఈజిప్టి (పులి) దోమ ద్వారా డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుందని వారు చెప్పారు. జ్వరం, తలనొప్పి, కండరాలు మరియు నొప్పికీళ్ల నొప్పి, దద్దు, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగ్యూ తీవ్రంగా ఉంటుంది కానీ నివారణే దాని నియంత్రణకు ఉత్తమ మార్గం అని తెలియజేసారు. వారానికి ఒకసారి తమ ఇళ్లలో లార్వా (పురుగులు) లేవని నిర్ధారించుకోవాలని, దోమల నిరోధకాలను ఉపయోగించాలని, పొడవాటి చేతులు మరియు ప్యాంటులు ధరించాలని, దోమతెరలు కింద నిద్రపోవాలని డాక్టర్లు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం లో సి హెచ్ ఓ యాదగిరి, సూపర్ వైజర్ సిరోమణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..