ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలకు దీటుగా నాణ్యమైన బోధన అంధించాలని భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాజేందర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని రుద్రారం జిల్లా పరిషత్, చిగురుపల్లిలో ప్రాథమిక పాఠశాల,దుబ్బపేటలోని కస్తూర్బా ఆశ్రమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల రోజువారీ హాజరు రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, విద్యార్థుల పాఠాన సామర్థ్యం తదితర అంశాలపై తనిఖీలు చేపట్టి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి లక్ష్మన్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.