కేసీఆర్‌ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్..

నవతెలంగాణ-హైదరాబాద్ : కేసీఆర్‌ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సర్వేలో బీఆర్ఎస్‌కు ఒకట్రెండు సీట్లు వస్తాయని తేలింది.. కేసీఆర్‌కు వచ్చే సీట్లే మాకు వస్తాయని చెబుతున్నారు అని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్‌ చెప్పే మాయమాటలు ప్రజలకు తెలుసు అని అన్నారు. ప్రతి హామీని వంద శాతం మేం అమలు చేస్తాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మెదక్ ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమోనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. సర్వే రిపోర్టులు చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, నారాయణపేట సభలో వణికిపోయారని అన్నారు.ఎవ‌డు ఎప్పుడు పోయి బీజేపీలో క‌లుస్త‌డో.. ముఖ్య‌మంత్రే జంప్ కొడుతడో.. ఏమైత‌దో తెలియ‌ని ప‌రిస్థితి అని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేలో తేలిపోయిందని అన్నారు.

Spread the love