
నవతెలంగాణ – మల్హర్ రావు
దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు గెలుపొందడం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆహ్వానం మేరకు మంథని నియోజకవర్గంలోని కాటారం మండలంలో ధన్వాడలో గ్రామంలో శ్రీదత్తాత్రేయ శివ పార్వతుల మూడవ వార్షికోత్సవ వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీదర్ బాబు, ఎమ్మెల్యేలు అడ్డురి లక్ష్మన్ కుమార్, విజయరమన రావు, మక్కాన్ సింగ్ రాకూర్, గండ్ర సత్యనారాయణ రావు, ప్రేమ్ సాగర్ రావు లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పారన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నందున దేశ ప్రజలు ఇండియా కూటమిని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో 12 నుంచి 14 వరకు ఎంపీ సీట్లు గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,రూ.500 లకే సబ్సిడీ వంట గ్యాస్,రూ.10 లక్షలతో ఆరోగ్యశ్రీ ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేశామని, త్వరలో మరో రెండు గ్యారెంటీలైన రైతు ఋణమాపి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులు అరేపెళ్లి మోహన్,దుద్దిళ్ల శ్రీనుబాను, దండు రమేష్,ఎంపిపిలు మల్హర్ రావు,సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.