ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా మానుకోవాలని మండలంలోని కవ్వాల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బి.హేమలత అన్నారు. స్వచ్ఛద నం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండలంలోని కవ్వాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పన్నారు. ప్లాస్టిక్ కవర్లకు, ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా గన్ని బ్యాగులను వాడాలని ఆమె చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దూరమవుతాయన్నారు. పరిసరాల్లో మొక్కలు ఎక్కువ పెంచుకుంటే ఆక్సిజన్ లభిస్తుందన్నారు.ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని,ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆమె సూచించారు.ముఖ్యంగా విద్యార్థులు పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాస్, రాయికుంట, లోతొర్రె అటవీ అటవీ అధికార్లు దుర్గం రాజేశ్వర్,అమృతరావు, తదితరులు పాల్గొన్నారు.