నవతెలంగాణ – కామారెడ్డి
దేశ బీడీ కంపెనీ ముందు బుధవారం జరిగే ధర్నాను బీడీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికుల నుండి సంవత్సరానికి 20 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నందుకు నిరసనగా మన కష్టం మనకు కావాలని, 16వ తేదీ బుధవారం నా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేశ బీడీ కంపెనీ ముందు జరిగే ధర్నాకు బీడీ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యం ఎన్నడు లేని విధంగా జిల్లాలో 20 జీబులు వేసుకొని అన్ని కార్ఖానాలు తిరుగుతూ, కార్మికుల నుండి వసూలు చేసిన రూ.20 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ధర్నా కార్యక్రమానికి పోవద్దు అని కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కాబట్టి కార్మికులు ఇవన్నీ పక్కకు పెట్టి మన నుండి వసూలు చేసిన రూ.20 కోట్ల రూపాయల దోపిడిని అరికట్టడానికి జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్నారు.