కార్మిక సంఘాల పట్ల నిరంకుశత్వం

– సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఆర్‌ఎంఎస్‌ పెన్షనర్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లా డుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తోందని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రయివేటు ఫ్యాక్టరీలలో కార్మికులు సమ్మెలు చేయకుండా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి అణచి వేస్తుందన్నారు. 80 శాతం ఉద్యోగుల మద్దతు కలిగి ఉన్న నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌, ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గ్రూప్‌ సీ యూనియన్‌ల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభు త్వం పునరాలోచించి గుర్తింపును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 14న కేంద్ర కమ్యూనికేషన్‌ మంత్రి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ సెక్రటరీకి మెమోరాండం ఇస్తామని తెలిపారు. 21న కామన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తామని, 28న నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డు లు ధరించి మానవహారం నిర్వహిస్తామని, జూన్‌ 10న అన్ని సంఘాలతో కలిసి ధర్నా చేపట్ట నున్నట్టు ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఆర్‌ఎంఎస్‌ పెన్షనర్స్‌ అసోసి యేషన్‌ నాయకులు తెలిపారు. సికింద్రాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి టి.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయ కులు బోస్‌, ఎల్‌ఐసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు తిరుపతయ్య, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నాయకులు సుబ్బయ్య, మెడికల్‌ రిప్స్‌ అసోసియేషన్‌ నాయకులు ముకుంద్‌ కులకర్ణి, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు శ్రీరామ్‌, నాయకులు జి.కృష్ణ భగవాన్‌, బి.ఆనంద్‌ బాబు, ఎస్‌ఎ.నాయుడు, ఆర్‌.రాంరెడ్డి పాల్గొన్నారు.

Spread the love