వానాకాలం పంట సాగు, విత్తనాల వివరాలు..


పంట సాగు విస్తీర్ణం విత్తనాలు క్వింటాలు
వరి 1,82,690 45,672
పత్తి 4,54,980 4,09,455 కందులు 1,82,824 6,002
పెసర 1,390 801
మొక్కజొన్న 2,776 9,916
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వానాకాలం పంట సాగు 10,23,948 ఎకరాలుగా వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 4,39,630 ఎకరాలు, వికారాబాద్‌లో 5,84,317 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు గాను 6,63,170 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నట్టు గుర్తించారు. ఎరువులు 1,77,187 మె ట్రీక్‌ టన్నులు అవసరం ఉంటుందని అంచనాలు వేశారు. కానీ ప్రస్తుతం జిల్లాలో 50 శాతం కూడా విత్తనాలు అందుబాటులో లేవు. దీంతో రైతులు విత్తనాల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం వర్షాధారంపై ఆధారపడి కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో సాగునీటి సౌకర్యంలో లేక పోవడంతో ఆరుతడి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఆరుతడి పంటల్లో వానాకాలం సీజన్‌లో పత్తి సాగు ఎక్కువగా ఉం టుంది. ఉమ్మడి జిల్లాలో 4,54,980 ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్టు అధికారులు అంచనాలు వేశారు. ఇందుకు గాను విత్తనాలు 10 లక్షల ప్యాకెట్లు అవసరం ఉన్నాయి. కానీ ప్రస్తుతం జిల్లాలో సుమారు మూడు లక్షల ప్యాకెట్లు మాత్రమే ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నా యి. పత్తి సాగు జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభ మవుతుంది. తొలకరి చినుకులు పడటం తరువాయి విత్తనాలు విత్తేందుకు రైతులు దుక్కులు రెడీ చేసుకున్నారు. కానీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఎదురుచుస్తున్నారు.
సకాలంలో విత్తనాలు అందించాలి
తొలకరి చినుకులతో రైతులు పత్తి విత్తనాలు విత్తేం దుకు దుక్కులు రెడీ చేసి పెట్టారు. ప్రభుత్వం సకా లంలో రైతులకు విత్తనాలు అందించాలి. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో లేకపోవడంతో దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొర తీసుకోవాలి. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించి, నకిలీ విత్తనాల బారి నుంచి కాపాడాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పంట సాగుకు ముందే విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలి.
– మధుసుదన్‌రెడ్డి , తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

Spread the love