నవతెలంగాణ-భిక్కనూర్ : పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని దేవాదాయ శాఖ డి ఈ ఓం ప్రకాష్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయం, తిప్పాపూర్ గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, బస్వాపూర్ లోని ఆంజనేయ స్వామి ఆలయాలను ఆయన సందర్శించి అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాట్లాడుతూ దేవ పురాతన దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ఇందులో భాగంగా కోట్లాది రూపాయలను ప్రభుత్వం అట్టి ఆలయాలకు మంజూరు చేసిందని తెలిపారు. ఆయన వెంట దేవాదాయ శాఖ ఎస్ ఈ మల్లికార్జున్ రెడ్డి, సిద్ధి రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్ధిరాములు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీధర్, ఆలయ పూజారులు రామగిరి శర్మ, సిద్దేశ్వర్ ఆలయ కమిటీ డైరెక్టర్లు,భక్తులు ఉన్నారు.