– చాంపియన్స్ ట్రోఫీలో కీలక బాధ్యతలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్. దేవరాజ్‌కు బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే భారత జట్టుకు టీమ్ మేనేజర్‌గా దేవరాజ్ వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. పాకిస్థాన్ పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించటంతో టీమ్ ఇండియా మ్యాచులను దుబారులో షెడ్యూల్ చేశారు. 1983 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు హైదరాబాద్‌కు చెందిన మాన్‌సింగ్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించగా.. సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్‌కు ఈ బాధ్యతలు దక్కటం పట్ల హైదరాబాద్ క్రికెట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.