కాంగ్రెస్ తోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి

– చెల్లాపూర్ లో దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర
– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ -దుబ్బాక: నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల తరహా దుబ్బాక అభివృద్ధికై తాము పోరాటం చేస్తున్నామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి తలపెట్టిన దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర 92వ రోజులో భాగంగా శనివారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో చెల్లాపూర్ వార్డ్ కి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి కాంగ్రెస్ పథకాలను ప్రచారం చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని, సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మాదిరిగా దుబ్బాక అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే దుబ్బాక అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love