తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని మండల పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాల్లు పర్వీన్, సునీత శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలలో ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.