తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

– రామక్కపేట లో కత్తి కార్తిక ప్రచారం
– అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తాం
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ అన్నారు.ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెచ్చుకుందాం అనే నినాదంతో దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో బుధవారం  హత్ సే హత్ జోడో యాత్ర నిర్వహించారు. అనంతరం మహిళలతో సమావేశమై మాట్లాడారు. ఈసందర్భంగా మీడియాతో కత్తి కార్తిక మాట్లాడుతూ… తెలంగాణలో తిరిగి ఇందిరమ్మ పరిపాలన సాధించుకుంటామన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల సాయం, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ప్రతీ ఇంట్లో ఇంట్లో ఇద్దరు వృద్ధులకు రూ.5 వేల పెన్షన్ సదుపాయం కల్పిస్తామన్నారు. అంటే కాకుండా ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు అందిస్తామని తెలిపారు. మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొత్త దేవి రెడ్డి(బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక),మిద్దె భూపాల్ గౌడ్,అశోక్ గౌడ్, ఎల్లం, శేఖరం,సిద్దాల రాజు,అమర్ గౌడ్,ముత్యం గౌడ్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Spread the love