కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సోనియా గాంధీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే పేద ప్రజల పక్షాన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కేడం లింగమూర్తి, మండల అధ్యక్షుడు బంక చందు, వెన్న రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love