కేసీఆర్ పాలనలో మహిళల అభివృద్ధి..

– మహిళా సంక్షేమ దినోత్సవ సభలో ఎమ్మెల్యే జాజల సురేందర్..
నవతెలంగాణ – ఎల్లారెడ్డి: మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎల్లారెడ్డి శాసనసభ్యుడు జాజుల సురేందర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం పట్టణ కేంద్రంలోని ముత్యపు రాఘవుల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళ దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజుల సురేందర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బాలికల పాటశాలలో మహిళా బోనాలతో ఎమ్మెల్యే జాజల సురేందర్ కి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వయంగా బోనం ఎత్తుకొని నల్ల పోచమ్మ మందిరం వరకు ఎత్తుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే జాజల సురేందర్ , జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ మహిళల వల్లనే రాష్ట్రం దేశం ప్రపంచం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుంది. అని తన విజయం వెనుక తన తల్లి ఉంది అని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పదార్థాలు అందిస్తున్నారు. అని మహిళల రక్షణ కోసం షి టీమ్ ఎల్లవేళలా పనిచేస్తుంది అని తెలిపారు. కామారెడ్డి జిల్లా మహిళలు అందిరికి ఆదర్శంగా నిలుస్తారు అని తనకు నమ్మకం ఉంది అని అందులో లింగంపేట్, సదాశివ నగర్ మహిళలు ముందు వున్నారు అని గంగు భాయి, నిర్మల అనే ఇద్దరు మహిళలు వ్యవసాయంతో పాటు చేపల పేపకం చేస్తూ అందిరికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జాజుల సురేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు సామూహిక స్థానం కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైద్య రంగంలో ఆశ వర్కర్లు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. విద్య ఉద్యోగం రాజకీయ రంగాలలో స్థానిక చట్టసభలలో అవకాశాలు కల్పిస్తూ వారి హక్కులను కాపాడుతున్నట్లు చెప్పారు. తల్లి పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో కామారెడ్డి జిల్లాలోని న్యూట్రిషన్ కిట్లను ప్రారంభించడం జరిగిందన్నారు. అంగన్వాడి కేంద్రాలలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు పాలు బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంగన్వాడీ టీచర్ల గౌరవించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 30% పెంచి వారి గౌరవాన్ని మరింత పెంచడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోనే ఎక్కడలేని విధంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్ వంటి పథకాలను తీసుకువచ్చి మహిళల సవలంబన కోసం వారి సాధికారత కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ అసలైన మహిళా బంధువుగా నిలిచారని అన్నారు. ఏ ఒక్క ఆడపిల్లల తండ్రి అప్పు లేకుండా పెళ్లిళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డల ముఖాల్లో తెలంగాణ ప్రభుత్వం చిరునవ్వు తెచ్చిందని చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి ని చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అని గత తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిన విషయం కంపడటం లేదా అని ఎల్లారెడ్డి గత ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. అని ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని అన్నారు. అదేవిధంగా మహిళల కు సామూహిక సీమాంతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళ చిన్నారులు చేసినా ఆట పాటలు ఎంతో అలరించాయి.ఈ కార్యక్రమనికి ఎల్లారెడ్డి డి ఎస్పీ శ్రీనివాస్ లు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి, లింగంపేట్ జడ్పీటీసీ శ్రీలత సంతోష్ రెడ్డి, గాంధారి జడ్పీటీసీ శంకర్ నాయక్, లింగంపేట్ ఎంపిపి గారిబున్నిసా, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కమిషనర్ జీవన్, సీడీపీఓ పద్మ , ఆయా గ్రామాల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు..

Spread the love