ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు: మేయర్

నవతెలంగాణ- కంటేశ్వర్
నగరంలోని 16వ డివిజన్ దుబ్బ ప్రాంతంలోని రామ్ గోపాల్ వీధిలో 13లక్షల నిధులతో చేపట్టే స్ట్రాం వాటర్ డ్రైనేజీ నిర్మాణా పనులకు 35, 36, 43డివిజన్ల పరిధిలో 10లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్ల అభివృద్ధికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే కి కార్పొరేటర్ల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని డివిజన్లలో కొనసాగుతున్నాయని 16వ డివిజన్ రామ్ గోపాల్ వీధిలో నిర్మించే నాలా ద్వారా వర్షాకాలం లో కురిసే వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలలో చేరకుండా మల్లింపు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పంచరెడ్డి ప్రవళిక, సుధీర్, మాస్టర్ శంకర్, మున్సిపల్ ఇంజనీర్ సుభాష్, నాయకులు మదని శ్రీధర్ వినోద్, పంచరెడ్డి అనిత, మధుకర్ రెడ్డి కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love