నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూర్, చిన్న ఎక్లారా, గ్రామాల్లో బుధవారం నాడు రాజమాత మహారాణి ఐలబాయి వోల్కర్ జై మల్లార్ 298 వ జయంతి వేడుకలను హాట్కర్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దన్నూర్ దేవిదాస్ పటేల్ మాట్లాడుతూ.. రాజమాత మహారాణి ఐలబాయి అందించిన సేవలు మరువలేనివని హట్కర్ సమాజ్ ప్రజలంతా ఆమె అడుగుజాడల్లో నడుచుకోవాలని కోరారు దన్నూరు గ్రామంలో జరిగిన ఐలాబాయి జయంతి వేడుకల్లో దన్నూర్ ఎంపీటీసీ సభ్యుడు హట్కర్ సమాజ్ పెద్దలు యాదవ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా చిన్న ఎక్లారా గ్రామంలో నిర్వహించిన ఐలబాయి జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ కొడిచెర ఎంపిటిసి కుమారుడు సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. జయంతి వేడుకలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ భీమ్రావు, హాట్కర్ సమాజ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.