‘సేక్రేడ్ గేమ్స్’లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి ఎల్నాజ్ నొరౌజీ. ‘కాందహార్’ చిత్రంతో హాలీవుడ్‌లో తెరగేంట్రం చేసి, పాపులర్ గెరార్డ్ బట్లర్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకుంది. తాజాగా కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఎల్నాజ్ నౌరౌజీ మాట్లాడుతూ, ‘ఇరాన్‌లో పుట్టి, జర్మనీలో పెరిగిన భారతీయ సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. ‘డెవిల్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాలో ఓ పాట ద్వారా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నా లుక్ చాలా స్పెషల్. నేను ఇంతక ముందు అలా ఎప్పుడు కనిపించలేదు. నాకు కూడా ఈ సినిమా ప్రత్యేకమే. నేను సినిమాలతో పాటు వెబ్ షోలు చేశాను. అలాగే పాడతాను కూడా. నేను పాడిన 2 పాటలు రీలిజ్ అయ్యాయి. 3వ పాట కూడా త్వరలో వస్తోంది. ప్రస్తుతం-నవాజుద్దీన్ సిద్ధిఖీతో ‘సంగీన్’, ‘రాణీతి’ అనే మూవీ జియో సినిమాలో విడుదలయ్యే సిరీస్‌లో నటిస్తున్నాను. నేను చేస్తున్న పాట ‘వోV్‌ా’ కూడా అదే ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అవుతుంది’ అని తెలిపింది.