శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో భక్తుల సందడి 

Crowd of devotees at Sri Kalabhairava Swamy Templeనవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే మూలభావి నుండి నీరు తెచ్చి ఆలయాన్ని శుభ్రం చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సందర్శకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు, సిబ్బంది లక్ష్మణ్, నాగరాజు, ఆలయ పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love