సింహాచల ఆలయానికి భక్తుల తాకిడి..

నవతెలంగాణ – విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఆలయం గురువారం భక్తుల తాకిడితో కిటకటలాడింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి వారికి చందన సమర్పణ పూర్తిచేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి మేల్కొలుపు పలికారు. సుప్రభాత సేవలు నిర్వహించి, సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన శ్రీ గంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు.

Spread the love