చార్ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఛార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో భక్తులు బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు వెల్లడించారు. గతేడాది తొలి నెల రోజుల్లో 4.5 లక్షల మంది బద్రీనాథ్‌ ఆలయాన్ని సందర్శించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే 50 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నట్లు వివరించారు.

 

Spread the love