యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

నవతెలంగాణ – యాదగిరి గుట్ట : యాదాద్రి (Yadadri) జిల్లాలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో ఒక్కరోజే రూ. కోటి 9లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 5,20,800, కైంకర్యాల ద్వారా రూ. 2,500, సుప్రభాతం ద్వారా రూ. 23,700, బ్రేక్ దర్శనం వల్ల రూ. 10,85,400, వ్రతాల ద్వారా రూ. 12,46,400 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. వాహన పూజల ద్వారా రూ. 24,400, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 23,85,000, ప్రచారశాఖ ద్వారా రూ.1,31,679, పాతగుట్టలో పూజల ద్వారా రూ. 3,29,200, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 8 లక్షలు వచ్చిందని వివరించారు. యాదఋషి నిలయం ద్వారా రూ. 3,73,792, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 2,91,096, శివాలయం ద్వారా రూ. 16,500, పుష్కరిణీ ద్వారా రూ. 4,200, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 34,31,490 వచ్చిందని వివరించారు. శాశ్వత పూజలు ద్వారా రూ. 42,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 1,91,900 , అన్నదానం ద్వారా రూ. 28,611, గది విరాళం ద్వారా రూ.11,700 ఆదాయం ఆలయానికి సమకూరిందని వివరించారు.

Spread the love