నవతెలంగాణ-హైదరాబాద్ : ములుగు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకే పోస్టుమార్టం నిర్వహిస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు. తాము ఎవరిపైనా విష పదార్థాలు వినియోగించలేదని తెలిపారు. పౌర హక్కుల నేతల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేశామని, వారు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడంతో ప్రాణరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.