రెంజల్ మండలం గండిగుట్ట గ్రామానికి చెందిన మార్కెటింగ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనతోపాటు దండిగుట్ట టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రామచందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, జి సాయి రెడ్డి, సిహెచ్ రాములు జావిద్ ఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు