ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ధారావత్ కుమారి బాబు నాయక్

నవతెలంగాణ – చివ్వేంల:  ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని  ఎంపీపీ దారావత్ కుమారి బాబు నాయక్ అన్నారు.  శనివారం మండలంలో స్పెషల్ ఆఫీసర్ జగదీశ్వర్ రెడ్డి టీం ఆధ్వర్యంలో సూర్య నాయక్ తండాలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించి స్థానిక ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు టీం ఆధ్వర్యంలో పాచ్యనాయక్ తండ, బద్య తండాలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ ధారావత్ కుమారి బాబు నాయక్ పాల్గొని  మాట్లాడారు. పలు కార్యక్రమాలలో తహసిల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మి, మండల వ్యవసాయ అధికారి  ఆశకుమారి, వెటర్నరీ  డాక్టర్ సంతోష్  డిప్యూటీ తహసీల్దార్ ఝాన్సీ, ఎంపీ ఓ గోపి, సర్పంచులు  రాజు, రవి, బానోత్ కాంతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్, లాలు నాయక్, గూగుల్ నాగేశ్వరరావు, పంచాయతీ  కార్యదర్శులు  అరవింద్ నారాయణ, మధు, మాధవి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love