ఎవ్వరికి ఓటేసినా నేనే గెలుస్తా… ఏంపీ ధర్మపురి అర్వింద్

నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నోటాకు ఓటు వేసినా.. కారు గుర్తుకు ఓటేసినా.. హస్తం గుర్తుకు ఓటేసినా.. తానే గెలుస్తానంటూ చెప్పుకొచ్చారు అర్వింద్. ఎవ్వరికి ఓటేసినా బీజేపీనే గెలుస్తుందని.. మళ్లీ మోడీనే వస్తారంటూ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ అర్వింద్ ఈ కామెంట్లు చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. పీఎం ఆవాస్ యోజన కింద.. దేశ వ్యాప్తంగా 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చామని తెలిపిన అర్వింద్.. ఇప్పటికే మూడున్నర కోట్ల ఇళ్లు నిర్మించామని పేర్కొన్నారు. మరో 50 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో కేసీఆర్ సర్కారు చాలా వెనుకబడిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో.. పేదలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుందని విమర్శించారు.

Spread the love