మున్సిపల్ డ్రైవర్ల వేతనాల్లో రికవరీని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా

నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వెయ్యి రూపాయలు పెంచి కార్మికుల జీతాలుగా చెల్లించి, అనేక కారణాలు చెబుతూ మళ్లీ రికవరీ చేయడం అంటే కార్మికుల నోటికాడి కూడు ను గుంజుకోవడమేనని అన్నారు, డ్రైవర్ల నుండి కట్ చేసిన జీతాలను వెంటనే చెల్లించాలని పెరిగిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ నాయకులు చంద్రసింహ, లక్ష్మణ్, నరేష్, మారుతి, వినోద్, సత్యనారాయణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love