4 వ రోజుకు చేరిన భూ నిర్వాసితుల ధర్నా..

నవతెలంగాణ – భువనగిరి రూరల్
బసాపురం రిజర్వాయర్లు ముంపుకు గురవుతున్న బి ఎన్ తిమ్మాపురం భూ నిర్వాసితులు నిర్వహిస్తున్న ధర్నా శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి జిన్న మల్లేశం మాట్లాడుతూ భూములకు, ఇండ్లకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు భూ నిర్వాసితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గతంలో అనేకసార్లు కలెక్టర్, ఆర్డిఓ, తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ప్రజలకు న్యాయం చేయట్లేదు అన్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల ప్రతినిధి వల్దస్ రాజు కాలభైరవ, పిన్నం శ్రీశైలం, అన్నపు గణేష్, నకరికంటి శ్రీను, డొంకన శ్రీశైలం, బాలరాజు, జహంగీర్, మల్లేష్, పాండు, బాలయ్య లు పాల్గొన్నారు.

Spread the love