నవతెలంగాణ – ప్రకాశం
పాఠశాలకు బస్సులు కేటాయించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు కూడలిలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు, సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట మోడల్ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు చేశారు. రెండు పాఠశాలలకు బస్సులు పూర్తిగా రద్దు చేస్తే విద్యార్థులు ఎలా వెళ్లాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, సీపీఎం నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థి నాయకుడు సురేశ్‌పై ఎస్సై శశికుమార్ దాడికి పాల్పడ్డారు. చొక్కాపట్టుకుని లాక్కెళ్లి పీఎస్‌కు తరలించారు. ఎస్సై తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.