రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ధర్నా వినతి పత్రం అందజేత..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించారు. 2018 సంవత్సరం నుంచి రైతులకు చేసిన రుణమాఫీ ఇంతవరకు అందడం లేదని వారు ఆరోపించారు. అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, ఆగస్టు 15 నుంచి విడుదలవారీగా లక్ష రూపాయల లోపు రుణాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ, ఇంతవరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం శోచనీయమన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని మాపి అయిన రుణాలను రైతులకు అందజేయాలని ఆయన కోరారు. ఆరుగాలం కష్టం చెప్పండించిన రైతుల వరి ధాన్యం ధరారులకు విక్రయించకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నడిపి నాగన్న, కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్, రెంజల్ మండల అధ్యక్షులు పెద్దులు ,ప్రధాన కార్యదర్శి ఎస్కే నసీర్, కోశాధికారి సిద్ధ పోశెట్టి, మైసయ్య, సాయిలు, రవి ,తదితరులు పాల్గొన్నారు..
Spread the love