మాజీ వ్యాపార భాగస్వామిపై ధోనీ క్రిమినల్ కేసు..

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ స్కిప్పర్ మహేంద్రసింగ్ ధోనీ మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిహిర్ మోసానికి పాల్పడ్డాడన్న ధోనీ ఫిర్యాదు మేరకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారమే మిహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో క్రికెడ్ అకాడమీ స్థాపనలో మిహిర్ అనధికారికంగా ధోనీ పేరును వాడుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ ఫిర్యాదు మేరకు మిహిర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. క్రికెట్ అకాడమీలు ప్రారంభించేందుకు ధోనీతో తనకున్న అనుబంధాన్ని మిహిర్ తప్పుగా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలున్నాయి. తన పేరును ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ తన ఆథరైజేషన్‌ను ధోనీ ఉపసంహరించుకున్న తర్వాత కూడా మిహిర్ ఆయన పేరును దుర్వినియోగం చేయడంతో ధోనీ ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాడు.

Spread the love