ధూల్‌పేట గంజాయి లేడీ డాన్‌ అరెస్టు

నవతెలంగాణ హైదరాబాద్‌: అనేక కేసుల్లో నిందితురాలిగా ఉన్న ధూల్‌పేట గంజాయి లేడీ డాన్‌ అంగూర్‌బాయిను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మకాలతో రూ.కోట్లకు పడగలెత్తిన అంగూర్‌బాయిపై ధూల్‌పేట ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 3 కేసులు, మంగళ్‌హట్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4 కేసులు, ఆసిఫ్‌నగర్‌, గౌరారం స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో అరెస్టు చేయడానికి పోలీసులు ఎన్ని సార్లు నిఘా పెట్టినా ఆమె తప్పించుకుంది. ఎట్టకేలకు కార్వాన్‌ ప్రాంతంలో గురువారం అంగూర్‌బాయిని ఎస్‌టీఎఫ్‌, ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Spread the love