
సుప్రసిద్ధ దేవస్థానం సిద్దులగుట్ట నందు శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం వద్ద ఆదివారం ధ్యాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) డైరెక్టర్లు సేతు బాలకృష్ణ ,ఆనంద్ హైదరాబాదు నుండి ముఖ్యఅతిథిలు గా విచ్చేసి ప్రసంగించినారు. ప్రతి ఒక్క వ్యక్తి శాఖాహారం భుజిస్తూ ధ్యానం చేయాలని , ధ్యానం వల్ల అన్ని విధాల బాగుంటుందని ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగ కారిని అని తెలిపారు.ఈ నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి , తిరుమల గంగారం ,నల్ల గంగారెడ్డి , కూనింటిశేఖర్ రెడ్డి, అమృత రావు, సాయి బాబా, రాజారాం, నారాయణ పాల్గొన్నారు.