– నీరు ఎలా విడుదల చేస్తారు?: రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని,టి.సాగర్
నవతెలంగాణ-సుజాతనగర్
”సీతారామ ప్రాజెక్టులో భాగంగా లిఫ్ట్ పనులు పూర్తి కాకుండానే ఎలా ప్రారంభిస్తారు.. బహుళ ప్రయోజనాలతో రూ.3,500 కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది..? ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు..? గోదావరిపై సీతమ్మ సాగర్ డ్యామ్ పూర్తి కాకుండా నీరు ఎలా విడుదల చేస్తారు..” అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కేంద్రంలో ఎలమంచిలి వంశీకృష్ణ అధ్యక్షతన సోమవారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభోత్సవానికి ప్రభుత్వం సిద్ధపడిందని విమర్శించారు. ూ.18 వేల కోట్లతో చేపట్టిన ఈ లిఫ్ట్ నిర్మాణంలో ఇప్పటివరకు రూ.8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇంకా పదివేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గోదావరిపై సీతమ్మ సాగర్ డ్యామ్ పూర్తి కాకుండానే సీతారామ ప్రాజెక్టుకు నీరు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిం చారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ిల్లాకు మూడున్నర లక్షల ఎకరాలకు నీరందించిన తర్వాత ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఈ నీటి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారన్నారు. సీతమ్మ సాగర్ బహులార్ధక సాగర్ ప్రాజెక్టు అని, 280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 30 టీఎంసీల వాటర్ స్టోరేజ్, రహదారి, మిషన్ భగీరథ, హెవీ వాటర్ ప్లాంట్ వంటి బహుళ ప్రయోజనాలతో రూ.3,500 కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెకటు పూర్తి కాకుండా నీళ్లు విడుదల చేయటం అసాధ్యమని అన్నారు. ఓ వైపు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తూ.. మరోవైపు 2028 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి ప్రకటించటం విడ్డూ రంగా ఉందని అన్నారు. అలాంటప్పుడు ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే ఎందుకు ప్రారం భిస్తున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాన ఐలయ్య, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, కున్సోత్ ధర్మ, కొండబోయిన వెంకటేశ్వర్లు, రవికుమార్, లక్ష్మీనారాయణ, సాంబశివరావు, కనక రత్నం, సత్యనారాయణ, నల్లగోపు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.