భర్తని భార్యే హత్య చేసిందా?

భర్తని భార్యే హత్య చేసిందా?స్పందన పల్లి, యుగ్‌ రామ్‌, వంశీ కోటు లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘ది ట్రయల్‌’. ఈ సినిమాను ఎస్‌ఎస్‌ ఫిలింస్‌, కామన్‌ మ్యాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ఫస్ట్‌ ఇంటరాగేటివ్‌ ఫిల్మ్‌గా దర్శకుడు రామ్‌ గన్ని రూపొందించారు. స్మతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్‌ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను ఈ నెల 24న థియేటర్స్‌ ద్వారా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మూవీ ట్రైలర్‌ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది. థ్రిల్లర్‌ జోనర్‌ సినిమా ఇది. డైరెక్టర్‌ రామ్‌ బాగా కథను డీల్‌ చేశారని ట్రైలర్‌తో తెలుస్తోంది. ఈ నెల 24న సినిమా థియేటర్స్‌లోకి వస్తోంది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీమ్‌ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మిసెస్‌ రూప, ఆమె భర్త అజరు వాళ్ళ మొదటి మ్యారేజ్‌ యానివర్సరీ ఒక అపార్ట్మెంట్‌ మేడపైన ఏకాంతంగా జరుపుకుంటున్నప్పుడు అనుకోని సమయంలో అజరు కాలు జారి బిల్డింగ్‌ పై నుంచి పడి చనిపోతాడు. ఇది మీడియాలో పెద్ద న్యూస్‌ అవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభిస్తారు. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌.. రూప తన భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని అనుమానిస్తాడు. ఆమెను ఇంటరాగేట్‌ చేస్తాడు. రూప మాత్రం తన భర్తది ఆత్మహత్యేనని గట్టిగా చెబుతుంది. ఇంతకీ అజరుది హత్యా?, ఆత్మహత్యా?, హత్యే అయితే పోలీస్‌ ఆఫీసర్‌ అయిన రూప తన భర్తనే ఎందుకు చంపింది అనే అంశాలతో ట్రైలర్‌ ఆసక్తి కలిగించింది. ట్రైలర్‌ కలిగించిన క్యూరియాసిటీ థియేటర్స్‌కు ప్రేక్షకుల్ని రప్పిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. అలాగే ముఖ్యంగా స్పందన పల్లి, యుగ్‌ రామ్‌, వంశీ కోటుల నటన చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్‌ పరంగా శ్రీ సాయికుమార్‌ దార తన కెమెరా పనితనాన్ని చాలా అద్భుతంగా చూపించారు. అదే విధంగా ట్రైలర్‌లో వినిపించిన మ్యూజిక్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ శరవణ వాసుదేవన్‌ చాలా బాగా కంపోజ్‌ చేస్తూ సినిమాలో ఉండే నేపథ్య సంగీతంపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ సినిమా ట్రైలర్‌కి ముఖ్యంగా ఎడిటింగ్‌ బాగా అనిపించింది అని చిత్రయూనిట్‌ తెలిపింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – శ్రీ సాయికుమార్‌ దారా, ఎడిటర్‌ – శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌, సంగీతం – శరవణ వాసుదేవన్‌, కో ప్రొడ్యూసర్‌ – సుదర్శన్‌ రెడ్డి, ప్రొడ్యూసర్స్‌ – స్మతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ, కథ స్క్రీన్‌ ప్లే దర్శకత్వం – రామ్‌ గన్ని.

Spread the love