పెరిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులుగా దిడ్డి మోహన్‌రావు

నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారక్క సన్నిధిలో మంగళవారం ములుగు జిల్లా పెరిక కుల సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘం ములుగు జిల్లా అధ్యక్షునిగా తాడ్వాయి మండలం కాటాపూర్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు దిండి మోహన్‌ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా బండారుపెల్లికి చెందిన పెట్టెం రాజు, ఉపాధ్య క్షులుగా బండారుపల్లికి చెందిన బియ్యాల కుమారస్వామి, రామన్నగూడెంకు చెందిన ఎగ్గడి కోటయ్య ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా నూగూరు వెంకటాపురంకు చెందిన పల్నాటి నాగేశ్వర్‌ రావును ఎన్నుకున్నారు.

Spread the love