డైట్ ఛార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్

sfi-condemns-illegal-arrestsనవతెలంగాణ – హైదరాబాద్: డైట్ ఛార్జీలకు సంబంధించిన అంశంపై గతంలో మంత్రి హారిష్ రావు సబ్ కమిటీ పంపిన ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఈ ఛార్జీలు పెంపు అనేది ప్రస్తుతం పెరిగిన ధరలతో పోల్చినప్పడు కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. ఎస్ఎఫ్ఐ ప్రస్తుతం పెరిగిన ధరలతో డైట్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తోంది. అలాగే గత 8 నెలలుగా పెండింగ్ ఉన్న డైట్ బిల్లులు కూడా విడుదల చేయాలని కోరుతుంది. ఈ పెంచిన ఛార్జీలు కేవలం డైట్ మాత్రమే కానీ కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదు. కాస్మోటిక్ ఛార్జీలు ప్రస్తుతం నెలకు బాలురకు 62/-రూపాయలు, బాలికలకు 100/- ప్రి మెట్రిక్ హస్టల్స్ లో ఇస్తున్నారు. ఈవియే మాత్రం సరిపోవు. కళాశాల విద్యార్థులకు సోషల్ వెల్ఫేర్ లో ఫాకెట్ మనీ పేరుతో కోంత ఛార్జీలు ఇచ్చిన ప్రస్తుతం ఇవ్వడం లేదు. అందుకే కాస్మోటిక్ ఛార్జీలు బాలురకు నెలకు 500/- బాలికలకు 1000/- రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. కళాశాల వసతి గృహాలు విద్యార్థులకు నెలకు 1500/- ఫాకెట్ మనీ ఇవ్వాలని కోరుతున్నాము.

Spread the love