కేసు కోర్టుకు వెళ్లిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తా : డింపుల్

నవతెలంగాణ-హైదరాబాద్ : అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేసులో ట్రాఫిక్ డీసీపీ కారును ఢీకొట్టారంటూ కేసు ఎదుర్కొంటున్న సినీ నటి డింపుల్ హయతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన మీద తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను డీసీపీని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేసింది. డీసీపీనే తన కారు కోసం అపార్ట్ మెంట్ లోకి ట్రాఫిక్ కోన్స్ ను తెచ్చి పెట్టారని డింపుల్ హయతి ఆరోపించింది. పబ్లిక్ ప్రాపర్టీ తీసుకువచ్చి ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టారని, ట్రాఫిక్ కోన్స్ ను ప్రైవేట్ అపార్ట్ మెంట్ లో ఎలా పెడతారని ప్రశ్నించింది. తన కారుతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టలేదని వెల్లడించింది. డీసీపీ కారుకు ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉండొచ్చని, నా కారుతో ఢీకొడితే రెండు కార్లకు డ్యామేజి ఉండాలి కదా అని డింపుల్ హయతి ప్రశ్నించింది. గన్ మన్లను కలిగి ఉండే అంత పెద్ద ఆఫీసర్లను నేనేం చేస్తాను? అంటూ డింపుల్ ప్రశ్నించింది. కేసు కోర్టు వరకు వెళ్లిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపింది.

Spread the love