దీపాదాస్‌ మున్షికి తెలంగాణ బాధ్యతలు

నవతెలంగాణ హైదరాబాద్: ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వ్యవహరించిన దీపాదాస్‌ మున్షికి కేరళ, లక్ష్యద్వీప్‌తో పాటు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యులుగా ఉన్న మాణిక్‌రావు ఠాక్రేను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకు గోవా, దామన్‌-డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీ బాధ్యతలను అప్పగించారు.

Spread the love