నవతెలంగాణ – జుక్కల్
ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో డీఐపీవో నాగరాజ్ శుక్రవారం నాడు ఎంపీడీఓ శ్రీనివాస్, సిబ్బంది తో కలిసి మెుక్కలను నటడం జర్గింది. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాందీ గురుకుల పాఠశాల ను సందర్శించారు. ఈ సంధర్భంగా అమ్మఆదర్శ పాఠశాల బాగంగా చేసిన ఏఏపీ పనులను పరీశీలించారు. వంటగది పరీశీలించారు. వండిన ఆహరపదార్థాల నాణ్యతను విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు. వుద్యావిదానంలో ఎమైన సమస్యలున్నాయా తెలియచేయాలని విద్యార్థినిలకు డీఐపీవో, ఎంపీడీఓ అఢిగారు. రోజువారి కార్యక్రమాలను నిర్వహణ నిర్వహిస్కున్నారా అని ప్రత్యేక అధికారీని అశ్వీని ని అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ హలులో ఐకేపీ, ఉపాదీహమీ, సమావేశం నిర్వహించి చేస్తున్న పనుల పురోగతి పైన, గ్రామాల ఆభివృద్ది పైన దృష్టి సారించాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వ హించాలని డీఐపీవో నాగరాజ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కాార్యక్రమంలో డీఐపీవో నాగరాజ్, ఎంపీడీఓ శ్రీనివాస్, సిబ్బంది గంగాధర్, మారుతీ పటేల్, భూమాగౌడ్, టీఏ రమేష్, ఐకేపీ సీసీలు తదితరులు పాల్గోన్నారు.