ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ప్రత్యక్ష పన్ను చెల్లింపులు

ముంబయి: తమ బ్యాంక్‌ ద్వారా ఇకపై ప్రత్యక్ష పన్ను చెల్లింపులు చేయవచ్చని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ వెల్లడించింది. భారత ప్రభుత్వం తరపున ప్రత్యక్ష పన్ను వసూలు చేయడానికి తమకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) ఆదాయపు పన్ను పోర్టల్‌తో తమ ఏకీకరణ పూర్తయినట్టు తెలిపింది. డౌన్‌లోడ్‌ చేయగల చలాన్‌లు, సులభమైన చెల్లింపులు, తక్షణ చెల్లింపు నిర్ధారణలకు సులభంగా పొందటంతో పాటుగా బ్యాంక్‌ కస్టమర్‌లు ఇప్పుడు వారి ప్రత్యక్ష పన్నులను చెల్లించడం కోసం స్పష్టమైన, సౌకర్యవంతమైన చెల్లింపు అనుభవం నుంచి ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం తమ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది.

Spread the love